చర్చ, జగిత్యాల: ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ పంచాయతీ
ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ పంచాయతీ
- పాలకవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
చర్చ, జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గం లోని రాయి కల్ మండలంలోని వీరాపూర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంకంగా ఎన్నికైంది. సోమవారం కొత్త పాలకవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వీరా పూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన దిండిగాల గంగవ్వ రామస్వామి, ఉప సర్పంచ్ నర్సా రెడ్డి వార్డు సభ్యులను అభినంధించిన ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఇంతియాజ్, చెట్ పెల్లి సుధాకర్, నాయకులు తదితరులున్నారు.