చర్చ,వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై బీజేపీ నాయకుల ఆగ్రహం….

చర్చ,వేములవాడ:
వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై బీజేపీ నాయకుల ఆగ్రహం….
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అకస్మాత్తుగా మూసివేయడం వివాదాస్పదమైంది. ఆలయ దర్శనాల నిలిపివేత పై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.
బుధవారం ఆలయ ప్రధాన ద్వారం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ , బిజెపి సీనియర్ నేత ప్రతాప్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ —
“ఆలయాభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ దర్శనాలను నిలిపివేయడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతాయి. ముందుగా ఆలయంలోని దర్గా సమస్యను పరిష్కరించిన తర్వాతే దేవతా విగ్రహాలను ముట్టుకోవాలి,” అని ఆయన హెచ్చరించారు.
భక్తులకు, ప్రజలకు స్పష్టమైన ప్రకటన ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయడం అన్యాయం అని ఆయన విమర్శించారు.
ఆలయ ప్రధాన ద్వారం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుడి ముందు ధర్నా నిర్వహించారు.
నాయకులు మాట్లాడుతూ —
“గతంలో రమాదేవి ఆలయాన్ని మూసివేసినప్పుడు మూడు రోజుల ముందే సమాచారం ఇస్తామని చెప్పగా కానీ నేడు రాజన్న ఆలయాన్ని హఠాత్తుగా అర్ధరాత్రి దర్శనాలను హఠాత్తుగా నిలిపివేయడంతో భక్తులను ఆవేదనకు గురిచేసింది,” అని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న పనులను చూసే విధంగా బయట లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని లేనట్లయితే బిజెపి రాష్ట్ర నాయకులు మినిస్టర్ బండి సంజయ్ గారు హెచ్చరించినట్టుగా పెద్ద ఎత్తున ఆలయం వద్ద ధర్నా చేసి ఆలయంలోకి ప్రవేశిస్తామని వారు హెచ్చరించా