చర్చ : జగిత్యాల, సిమెంట్ రోడ్డులో కలిసి పోయిన అంజన్న విగ్రహం…మండిపడుతున్న వి. హెచ్. పి. బీజెపి నేతలు…


సిమెంట్ రోడ్డులో కలిసి పోయిన అంజన్న విగ్రహం…మండిపడుతున్న వి. హెచ్. పి. బీజెపి నేతలు…
రోడ్డు విస్తరణ పనుల్లో ఆంజనేయుని విగ్రహం సిమెంట్ లో కూరుకు పోయిన సంఘటన ధర్మ పురిలో జరుగగా వి. హెచ్. పి. బిజెపి నేతలు మండి పడుతున్న ఘటన ఇది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం లో కోనేరు దారిలో ప్రాచీన కాలం నుంచి రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేదని స్థానికులు తెలిపారు. ఇటీవల కోనేరు దారిలో ఓ కాంట్రాక్టర్ చేపట్టిన సి. సి రోడ్డు నిర్మాణం సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించగా ఇందులో ఆంజనేయుడి విగ్రహం రోడ్డులో సగానికి పైగానే కురుకుపోయిందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలిసిన విశ్వహిందూ పరిషత్, బిజెపి నేతలు, కార్యకర్తలు ఈ సంఘటన ను నిరసిస్తూ ధర్మ పురి ఆలయ ఈ. వో కు వినతి పత్రం అందించారు. అంజన్న విగ్రహాన్ని యదాస్థానంలో పూర్వరీతిలో ఉంచాలని లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.