చర్చ నందతండా: గెలుపు డిసైడ్ వార్ వన్ సైడ్
గెలుపు డిసైడ్ వార్ వన్ సైడ్
- వరాల జల్లులతో సర్పంచ్ అభ్యర్థి
- ఆనందంతో తడిసిన అంబేద్కర్ నగర్ వాసులు
- భారీ విజయన్ని అందజేస్తాం అంటున్న గ్రామస్తులు
చర్చ నందతండా:
చుంచుపల్లి మండలం నందతండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా అంబేద్కర్ నగర్ కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవకు మొదటి పీట వేసే పార్టీ. మహిళలకు ఉచిత బస్సులు, ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం భోజనం, ఇందిరమ్మ ఇల్లు, త్వరలోనే రాజీవ్ యువ వికాస్ యోజన లోన్లు కూడా అందుతాయని తెలిపారు. పంచాయతీల అభివృద్ధితో పాటు మానవ సంబంధాలు కూడా చాలా ముఖ్యమైనవని అన్నారు. శుభకార్యాలకు స్త్రీలకు పట్టుచీరలు, పురుషులకు పట్టు వస్త్రాలు, అశుభ కార్యాలు జరిగినప్పుడు కుటుంబానికి 5000 రూపాయలు ఇస్తానని, గెలిచిన మొదటి నెలలోనే 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తానని, ప్రతి సమస్యను ఇంటి పెద్దగా భావించి పరిష్కరిస్తానని అజ్మీరా మంగీలాల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే అని ఒక్క పార్టీకి మాత్రమే కాదని, రాష్ట్రంలో ఉన్నది మన ప్రభుత్వమే. అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు ఉండవని నిధుల సమీకరణలో జాప్యం జరిగిన సొంత ఖర్చుతో పంచాయితీ స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని, రాబోయే ఐదు సంవత్సరాలలో కేవలం అభివృద్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ డిపిసిసి అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ కంచర్ల చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కోనేరు చిన్ని, మండల నాయకులు అంతోటి పాల్, జిఎం ఆనందరావు, జెట్టి మోహన్, మెల్లం పురుషోత్తం, శ్రీను, నాగరాజు, అబ్దుల్, గ్రామస్తులు తోకల రాజు, అంతోటి రాజు, తంబళ్ల, గడ్డం మాధవరావు, సిరిమల్ల కుమారస్వామి, గడిదేసి చిరంజీవి, గడ్డం చిన్నస్వామి తదితరులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడమే గాక సర్పంచ్ విజయాన్ని ఖరారు చేశారు.