చర్చ , ములుగు : ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
రహదారిని నిర్బంధించడంతో నిలిచిన ట్రాఫిక్

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
_రహదారిని నిర్బంధించడంతో నిలిచిన ట్రాఫిక్
చర్చ ములుగు జిల్లా బ్యూరో నవంబర్ 18:
(వెంకటాపురం)
ములుగు జిల్లా ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వెంకటాపురం మండలం ఆలు బాక గ్రామం లో ప్రజలు ఇసుక లారీలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు .ప్రధాన రహదారిపై ఇసుక లారీలను స్థానిక గ్రామస్తులు అంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో సుమారు 5 కిలోమీటర్ల మేర వందల సంఖ్యలో ఇసుక లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. బ్రిడ్జి రోడ్లు నిర్మాణం చేపట్టాలని లారీల వల్ల వచ్చే దుమ్ము ,ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. నిత్యం లారీల రవాణా కారణంగా రోడ్డు పక్కన ఉన్న పంటలు కూడా నాశనం అవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.