News & Views

చర్చ రామగిరి : ప్రమాద హెచ్చరిక కోల్ కారిడార్ రోడ్‌లో దట్టమైన పొగ మంచు

  • ప్రమాద హెచ్చరిక
  • కోల్ కారిడార్ రోడ్‌లో దట్టమైన పొగ మంచు
  • సెంటినరీకాలనీ–గోదావరిఖని ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తం

చర్చ రామగిరి : సెంటినరీకాలనీ నుంచి గోదావరిఖని వెళ్లే ప్రధాన రహదారి అయిన కోల్ కారిడార్ రోడ్‌పై గురువారం ఉదయం దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. రోడ్డుపై ముందున్న దృశ్యం పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పొగ మంచు కారణంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు నిదానంగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ రోడ్డులో ప్రమాదాలు జరిగే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఉదయం వేళ ఉద్యోగులు, కార్మికులు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ తగిన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్ లైట్లు, స్పీడ్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ పోలీసుల ద్వారా నియంత్రణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.