చర్చ : రామగిరి: బాలవికాస ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్
రాజాపూర్ గ్రామ ప్రజలు రక్షితమైన శుద్ధ జలాలను త్రాగాలనే సదుద్దేశంతో రాజాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య , ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ బాలవికాస సేవా విభాగాన్ని కలిసి సంప్రదింపులు జరిపారు.
ఈ సందర్భంగా బాలవికాస బృందం రాజాపూర్ గ్రామ ప్రజలకు తమ వంతు సహాయంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. గ్రామ ప్రజలకు మరింత మేలు చేకూర్చే విధంగా బాలవికాస సంస్థ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సర్పంచ్ శ్రీమతి భాగ్యలక్ష్మి కొమురయ్య , ఉపసర్పంచ్ శ్రీకాంత్ ముదిరాజ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లద్నాపూర్ గ్రామ సర్పంచ్ వనం రాంచందర్ రావు, వార్డు సభ్యులు కాల్వ రజిత శ్రీనివాస్, కలవేన స్వరూప రమేశ్, కన్నూరి శశికుమార్, కాదాసి రమేష్, హఫీజుద్దీన్, అలాగే నాయకులు మాటేటి రవి, ఉమ్మనవేన కుమార్, ఉగ్గె ప్రశాంత్, మాటేటి శ్రీనివాస్, కన్నూరి వెంకటి, మొగిలిరేణుక, నిట్టూరి స్వరూప, గరిగంటి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.