చర్చ, కొత్తగూడెం : కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం- గుర్తింపు సంఘం ఎఐటియుసి

కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం- గుర్తింపు సంఘం ఎఐటియుసి
స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్ లను అమలు చేయాలి.
ఏ.సి.బి కేసు తో సంబంధం లేకుండా మెడికల్ బోర్డు ను వెంటనే నిర్వహించాలి.
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.
పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ యాజమాన్యమే చెల్లించాలి.
జనరల్ సమ్మె లో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుంచి జీతం రికవరీ చేయొద్దు.
కాంట్రాక్టు కార్మికుల కు కనీస వేతనాలు చెల్లించాలి.
కొత్త గనులను సింగరేణి కి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం పై ఆందోళనలు.
శేషగిరిభవన్ లో జరిగిన ఏఐటియుసి మీడియా సమావేశంలో మిరియాల రంగయ్య వెల్లడి.
చర్చ, సింగరేణి కొత్తగూడెం
సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం శేషగిరిభవన్ లో జరిగిన ఏఐటియుసి మీడియా సమావేశంలో వివరాలను వారు వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటియుసి తో నవంబర్ 2024 , మార్చి 2025 లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలు డిమాండ్ లను అంగీకరించి అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా స్వంత ఇంటి పథకాన్ని, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ చెల్లింపు లపై సర్క్యులర్ లను జారీ చేయకుండా కార్మికుల ను మోసం చేస్తుందని వారు ఆరోపించారు. మెడికల్ బోర్డు ను ఏ.సి.బి విచారణ పేరుతో నిలిపి వేశారని వారు ఆరోపించారు. అనారోగ్యం వల్ల కార్మికులు చాలా మంది మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు కు పిలువ కుండా కాలయాపన చేస్తూ కార్మికుల ను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. మారుపేర్లు విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంటు లకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వారికి ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపించారు. జనరల్ సమ్మె లో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుంచి జీతం రికవరీ చేస్తామని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దానిని వెంటనే రద్దు చేసి రికవరీ చేయొద్దని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి కి కొత్త గనులు ఇవ్వకుండా తెలంగాణ లో ఉన్న సింగరేణి సంస్థ ను నిర్వీర్యం చేస్తుందని వారు ఆరోపించారు. వేలం తో సంబంధం లేకుండా తెలంగాణ లో ఉన్న కొత్త గనులు సింగరేణి కి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి లో మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్ మెన్ ల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, లేకుంటే సమ్మె కు పిలుపునిస్తామని వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి,బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు,సహాయ కార్యదర్శులు గట్టయ్య,రాము,వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్,ఎరగని కృష్ణయ్య,లక్ష్మీనారాయణ,సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, జాన్ నరసయ్య,మండల రాజేశ్వరరావు,బండారి మల్లయ్య,తిరుపతి, సోమయ్యా, రమేష్ తాతిదారులు పాల్గొన్నారు .