చర్చ, ములుగు: అవినీతి రహిత పంచాయతీ గా తీర్చి దిద్దుతాం

- ఆదర్శ గ్రామపంచాయతీ గా ఏటూరు నాగారం ను తీర్చి దిద్దుతాం
- కాకుల మర్రి మార్క్ కనబడుతుంది
- ఏటూర్ నాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత
ఏటూరు నాగారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన కాకులమర్రి శ్రీలత సోమవారం రోజున మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏటూరు నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు, కాకులమర్రి కుటుంబాన్ని నన్ను ఇంత పెద్ద ఎత్తున ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర మొత్తం ఏటూరునాగారం వైపు చూసే విధంగా చేసిన ప్రజలందరికీ జీవితాంతం కాకులమర్రి కుటుంబం రుణపడి ఉంటుంది. ఏటూరు నాగారం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గ్రామపంచాయతీని రాష్ట్రంలోని ఆదర్శవంత గ్రామం గా మీ అందరి సహకారంతో తీర్చిదిద్దుతాను.ప్రజలందరికీ మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నదమ్ముల అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురండి కచ్చితంగా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నదాన్ని 24 గంటల్లో సమస్యను పరిష్కారం చేసుకుందాం, ప్రజలకు ఏటూరు నాగారాన్ని అభివృద్ధి చేసి చూపిద్దాం మీ అందరి సహకారంతో మా లక్ష్యం ప్రజాసేవ చేయటమే మేము గెలిచింది ఇక్కడ ఉన్న గ్రామపంచాయతీలో దోచుకోవడానికి కాదు, దాచుకోవడానికి కాదు గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నిలిపి రాష్ట్రస్థాయిలోనే ముందు నిలిపే విధంగా మా కాకుల మర్రి కుటుంబం ముందు ఉంటుంది
ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతాం ప్రజాసేవ చేయడమే మా కర్తవ్యం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ఒక్క రూపాయి కూడా వృధా పోకుండా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీ అందరి అభిప్రాయాలు సలహాలు సూచనల మేరకు మా గ్రామ పంచాయతీ పాలకమండలి సూచనలు సలహాలు తో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని హామీ ఇచ్చారు .అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామపంచాయతీ సిబ్బందికి కాకులమర్రి లక్ష్మణ్ బాబు శ్రీలత కొత్త బట్టలు వారికి ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో వచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.