చర్చ, పెద్దపల్లి: మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తాం – యూఎండబ్ల్యూఎస్ పెద్దపల్లి టౌన్ అధ్యక్ష కార్యదర్శులు..
- యూఎండబ్ల్యూఎస్ పెద్దపల్లి టౌన్ అధ్యక్ష కార్యదర్శులు..
అస్లాం పర్వేజ్, సైఫుల్లా ఖాన్ ..
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నా మైనారిటీ ల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన యూఎండబ్ల్యూఎస్ పెద్దపల్లి పట్టణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మొహమ్మద్ అస్లాం పర్వేజ్, కార్యదర్శి సైఫుల్లా ఖాన్ లు తెలిపారు. ఆదివారం రోజున పెద్దపల్లిలో పట్టణంలోని ఎంబీ గార్డెన్ లో నూతనంగా ఎన్నికైన యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులను పట్టణానికి చెందిన వతన్ డ్రై ఫ్రూట్స్ యజమాని సయ్యద్ జుబేర్ ఖాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ ఇలియాజ్ అలీ ఆధ్వర్యంలో ఘనంగాh సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్ష ,కార్యదర్శులు మాట్లాడుతూ పేద మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం మొదటి ప్రాముఖ్యత ఉంటుందని, పేద మైనారిటీ పెళ్లి కానీ యువతుల కోసం ఆర్ధిక భరోసా కల్పిస్తామని, పెద్దపల్లి పట్టణంలో మైనారిటీ షాదీ ఖానా ఏర్పాటు కోసం కృషి చేస్తామని, రాఘవపూర్ లో ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల కబ్రాస్తాన్ స్థలంలో కాంపౌండ్ వాల్ కోసం కృషి చేస్తామని, నేటి నుండి మైనార్టీలకు ఏ సమస్య వచ్చిన తమను సంప్రదించాలని, పెద్దపల్లి మైనార్టీ సోదరులు తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. అనంతరం ఉపాధ్యక్షులు మౌలానా లాయాఖుల్లా, కోశాధికారి మిస్బా లు మాట్లాడుతూ అల్లా ఆశీస్సులతో తమను పెద్దపల్లి పట్టణం మైనార్టీ సోదరులు గెలిపించడం అదృష్టంగా భావిస్తున్నామని, మాపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు మైనార్టీల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని మస్జీద్ కమిటీల సభ్యులు, మస్జీద్ ఇమామ్ లు, పట్టణ మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.