చర్చ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వయోవృద్ధుల సంక్షేమంమే ప్రభుత్వ ప్రాధాన్యం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

వయోవృద్ధుల సంక్షేమంమే ప్రభుత్వ ప్రాధాన్యం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
చర్చ కలెక్టరేట్
ఐడిఓసి సమావేశ మందిరంలో ఈ రోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో కుటుంబాలు వయోవృద్ధులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు పెరిగిపోతున్నాయని, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు వృద్ధులను బాధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని తెలిపారు. పోషణ భృతి పొందాల్సిన వృద్ధులకు చట్ట ప్రకారం భృతి అందుకునేలా జిల్లా సంక్షేమ శాఖ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లతో సమన్వయం చేసి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నామని, వృద్ధులందరికీ ఆరోగ్య మరియు జీవన భీమా పథకాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక క్యాంపులును నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలో వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్, జిరియాట్రిక్ వార్డ్‌ను ఏర్పాటు చేయించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని, స్పెషలిస్ట్ డాక్టర్లతో వెల్‌నెస్ సెషన్లు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్, సందీప్, కృష్ణయ్య, శివప్రసాద్, యూసఫ్, శివరామ్, భూషణ్ రావు, వెంకటేశ్వర్లు, సిడిపివోలు లక్ష్మీ ప్రసన్న, పద్మశ్రీ, వరప్రసాద్, నరేష్, ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, వయోవృద్ధులు మరియు తదితరులు పాల్గొన్నారు.