చర్చ : టెక్నాలజీ, డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
ఇటీవల చాలా మంది సైబర్ మోసగాళ్ల వల్ల డిజిటల్ అరెస్ట్” అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజమైన చట్టపరమైన అరెస్ట్ కాదు. ఇది పూర్తిగా స్కాం / మోసం.
డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది?
స్కామర్లు ఇలా చేస్తారు:
ఫోన్ కాల్ / వీడియో కాల్ చేస్తారు
వారు పోలీస్, CBI, RBI, FedEx, Cyber Cell లాగా నటిస్తారు.మీకు భయపెట్టే మాటలు చెబుతారు.మీ Aadhaar తో క్రైమ్ జరిగింది.మీ ప్యాకెట్లో డ్రగ్స్ దొరికాయి.మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.తర్వాత వీడియో కాల్ ఓపెన్ చేయమని అంటారు.మీరు ఎక్కడికీ వెళ్లకుండా స్క్రీన్ ముందు కూర్చోవాలి అని చెప్తారు.
ఇదే వారు “డిజిటల్ అరెస్ట్” అంటారు.చివరికి పేమెంట్ / ఫైన్ / సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బులు అడుగుతారు.
ఇది పూర్తిగా నకిలీ. పోలీస్‌లు ఇలాంటి డిజిటల్ అరెస్ట్ చేయరు.భారతీయ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం లేదు.వాట్సాప్/వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు.డబ్బులు అడగరు.మీకెవ్వరితోనూ మాట్లాడొద్దని చెప్పరు.
మీకు డిజిటల్ అరెస్ట్ కాల్ వస్తే చేయాల్సినవి….కాల్‌ను వెంటనే కట్ చేయండి.ఎలాంటి డబ్బు పంపొద్దు మరియు ఎలాంటి వివరాలు (OTP, బ్యాంక్, Aadhaar) ఇవ్వొద్దు..స్క్రీన్‌షేర్, వీడియోకాల్ చేయొద్దు
Cybercrime portalలో కంప్లైంట్ చేయండి…https://cybercrime.gov.in
1930 హెల్ప్‌లైన్‌కి కాల్ చేయండి (సైబర్ మోసాల సహాయం)