చర్చ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి:ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్ పార్టీదే..
ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్ పార్టీదే..
- ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాం..
- అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు..
- పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..
పెద్దపల్లి నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మూడోవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు వినియోగించుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని తన స్వగ్రామం అయిన శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయరమణ రావు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణా రావు మీడియాతో మాట్లాడారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో రెండు విడుతలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారని, మూడవ విడత ఎన్నికలలో 91 గ్రామపంచాయతీలకు ఆరు గ్రామాలు ఏకగ్రీవం కాగా 85 గ్రామాలకు, 610 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. మూడవ విడత ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా, ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో రెండు విడతల ఎన్నికలు పూర్తయి, మూడో విడత జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుందన్నారు.రెండు సంవత్సరాల కాలంలో 10 సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచామని, మరో మూడు సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు పరుస్తామని తెలిపారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారని మరో మూడు సంవత్సరాల కాలంలో గ్రామాలలో అభివృద్ధి జరిగేందుకు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి పరిచి రానున్న మూడు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు. ఓటు హక్కు అనేది అందరి బాధ్యత అని, ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.