News & Views

చర్చ, సత్తుపల్లి : భద్రత ఎక్కడ..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు వ్యవసాయ పనులకు, ఫ్యాక్టరీ పనులకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పదులు 20 సంఖ్యల్లో ఆటోల మీద ప్రయాణం చేస్తూ సామాన్య జీవితం గడుపుతున్న సామాన్యులు. ప్రమాదపు అంచున కూర్చొని తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి కూలి పనికి వెళుతూ జీవనం గడుపుతున్న కూలీలకు రక్షణ లేకుండా పోయింది. అధికారులు రోడ్డు భద్రత వారోత్సవాల పేరుతో సంవత్సరానికి ఒకసారి తూతూ మంత్రంగా భద్రత వారోత్సవాలు జరుపుతున్నామని చెబుతూ ఒకపక్క ప్రజలు జీవితాలు ప్రమాదం జరిగితే గాలిలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయని మేధావులు అంటున్నారు. ప్రజలు భద్రతా దృష్ట్యా పెట్టుకొని సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించి ప్రాణాలకు ముప్పు లేకుండాచూడాలని ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి భద్రత వారోత్సవాలు జరుపుకునే విషయంలో ప్రతిరోజు భద్రత గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని అలా కల్పిస్తే అనేక ప్రమాదాలు జరక్కుండా ఉంటాయని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.