News & Views

చర్చ, పెద్దపల్లి: పెద్దాపూర్ గ్రామానికి తన వంతు సాయం, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి: జె కె శేఖర్ యాదవ్

  • బాడీ ఫ్రీజర్ రిపేరు ఖర్చులకు Rs.33,000/- సహాయం
  • GP నూతన పాలకవర్గానికి అప్పగింత

జూలపల్లి మండలం పెద్దాపూర్ మాజీ సర్పంచ్ కంకణాల భారతి – జ్యోతిబసు విజ్ఞప్తి మేరకు పెద్దాపూర్ గ్రామానికి బాడీ ఫ్రీజర్ రిపేరు ఖర్చులకు ₹ 33,000 వేల రూపాయలు అవుతుందని BJYM రాష్ట్ర నాయకులు, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకులు జె కె శేఖర్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన బాడీ ఫ్రీజర్ రిపేరు చేయించి మంగళవారం గ్రామ పంచాయితి నూతన పాలకవర్గం సర్పంచ్ తొగరు శ్రీనివాస్, ఉప సర్పంచ్ జెల్ల కనకయ్య, వార్డు సభ్యులు తీగల అశోక్ గౌడ్ , బైరా ఎల్లవ్వ-ఎల్లయ్య, కల్లెపల్లి పోచాలు, కల్లే పెళ్లి స్వామి, కల్లేపల్లి ఉమేందర్ , MD.షాహిని బేగం – ఫారుక్ లకు అందజేశారు.

ఈ సందర్భంగా పెద్దాపూర్ గ్రామంలో జె కె శేఖర్ యాదవ్ ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… పెద్దాపూర్ గ్రామానికి తన వంతు సాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని, అలాగే గ్రామంలో నూతన పాలకవర్గం, అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పాలని సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జెల్ల మహేష్ యాదవ్, కంకణాల జ్యోతిబసు, గుండు చంద్రమౌళి అల్లాడి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.