చర్చ, చుంచుపల్లి: విద్యానగర్, రామాంజనేయ కాలనీ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం కానున్నాయా?
విద్యానగర్, రామాంజనేయ కాలనీ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం కానున్నాయా..?
చుంచుపల్లి మండలం విద్యానగర్, రామాంజనేయ కాలనీ పంచాయతీలలో సిపిఐ పార్టీ బలపరిచి విద్యానగర్ సర్పంచ్ ని ఏకగ్రీవం చేసిన సంగతి అందరికీ విధితమే. కానీ ఇప్పుడు, సిపిఐ తరపున ఏకగ్రీవమైన సర్పంచ్ కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అలాగే రామాంజనేయ కాలనీలో సిపిఐ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లు కాంగ్రెస్ లోకి వెళ్ళనున్నట్లుగా కూడా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.