చర్చ ,కొత్తగూడెం : మహిళల చైతన్యమే సామాజిక మార్పుకు నాంది


చర్చ , కొత్తగూడెం :
మహిళల చైతన్యమే సామాజిక మార్పుకు నాంది
హక్కుల రక్షణ కోసం మహిళలు ఐక్యంగా పోరాడాలి
అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి
ఆర్థిక స్వావలంబనతోనే మహిళా సాధికారత సాధ్యం
సింగరేణి ప్రధాన కార్యాలయం మరియు మెయిన్ హాస్పిటల్ లో ఎఐటియుసి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు
మహిళల చైతన్యమే సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని, మహిళలకోసం రూపొందించిన రక్షణ చట్టాలు, హక్కులు పరిరక్షిచబడతాయని గుర్తింపు సంఘం *ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి* అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఐటియుసి మహిళా విభాగం ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం మరియు మెయిన్ హాస్పిటల్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు.సింగరేణి ప్రధాన కార్యాలయం,మెయిన్ హాస్పిటల్ లో
వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న అధికారి రాజ్యలక్ష్మీ డిజిఎం(ఐ టీ) మరియు పద్మ (పర్చేస్) డాక్టర్ రాజీవ్ తేజ్,స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి లను ఎఐటియుసి మహిళా విభాగం వారు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అధికారి రాజ్యలక్ష్మి, డాక్టర్ రాజీవ్ తేజ్ మాట్లాడుతూ మహిళలు మానసికంగా, శారీరికంగా దృఢంగా ఉండాలని, మహిళా ఉద్యోగులు ఎందులోనూ తక్కువ కాదు అనే విధంగా ఉండలని,అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు, కార్యాలయంలో మరియు ఇంటి కార్యక్రమాలను రెండింటిని చేయగలను అని నిర్ణయించుకొని ముందుకు సాగాలని,అదేవిధంగా పివికే 5 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ లో 10 మందికి పైగా మహిళా అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు,ఇకముందు కూడా మహిళా సాధికారత వాతావరణం సింగరేణి సంస్థ లో ఎక్కువ ఉంటుందని,సంస్థ ఉన్నతి లో మహిళా పాత్ర ఉన్నతమైనది గా మనం ఉండాలి అని తోటి సింగరేణి మహిళ ఉద్యోగులకు హితవు పలికారు.
సింగరేణి యాజమాన్యం మహిళల సౌకర్యాలు కోసం క్రేచ్ రూమ్ ఏర్పాటుచేయాలని మరియు ప్రత్యేక డైనింగ్ హాల్ ఏర్పాటుచేయాలని,మహిళా ఉద్యోగులకు ఎటువంటి సమస్య ఉన్న తమకు తెలియచేయాలని ఎఐటియుసి నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉషా సౌమ్య రజిత శారద రమా గారు పూజిత మరియు మహిళా ఉద్యోగులు అందరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ సహాయ కార్యదర్శి రాము ఆర్గనైజింగ్ కార్యదర్శులు నితిన్,రవీందర్, నాగయ్య ,శ్యామ్,రంజిత్, రామకృష్ణ,అనంతలక్ష్మి,సరిత, డాక్టర్ వినూత్న, డాక్టర్ సువర్ణ రేఖ, కృష్ణవేణి , పుష్ప , మౌనిక వరుణ్యా ,మమతా, కళ్యాణి నాగమణి, నాగగీత,తాతిదారులు పాల్గొన్నారు