News & Views

చర్చ,గోదావరిఖని: గ్రామాల అభివృద్దికి అండగా ఉంటా పని చేయండి.- నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచన.

గ్రామాల అభివృద్దికి అండగా ఉంటా పని చేయండి.

  • నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచన.

 

రామగుండం నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి మరియు అంతర్గాం మండలాలలోని వివిద గ్రామాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ గోదావరిఖని క్యాంప్ కార్యాలయంలొ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గ్రామాల అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.