చర్చ, సత్తుపల్లి: ఎంపీడీవో ఆఫీస్ పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం..
ఎంపీడీవో ఆఫీస్ పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం..
చర్చ, సత్తుపల్లి:
తన భార్యను కాపురాన్ని పంపించాలంటూ సోమవారం ఎంపీడీవో కార్యాలయం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించాడు. పలుమార్లు బ్లేడుతో చేతి పై గాయాలు చేసుకున్నాడు. తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామానికి చెందిన మాడుగుల గోపి అదే మండలము మల్లారం గ్రామానికి చెందిన ఓ యువతి తో వివాహం అయింది. మూడు రోజుల క్రితం భార్య భర్తలు మధ్య గొడవలు రావడంతో గోపి తన భార్యను కొట్టడంతో తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్ళింది. గోపిని పోలీస్ స్టేషన్ కు పిలిపించడoతో తనకు ఎటువంటి న్యాయం జరగలేదని తన భార్యను కాపురానికి పంపించాలని బాధితుడు బిల్డింగ్ పైకి ఎక్కినానని తెలిపాడు. సమాచారం తెలుసుకున్న తాసిల్దార్ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో సురేష్ బాబు, పోలీసులు, స్థానికులు అక్కడ చేరుకొని సర్ది చెప్పడంతో యువకుడు కిందికి దిగి వచ్చాడు. విషయం తెలుసుకున్న భార్య కూడా తన తల్లిదండ్రులతో అక్కడకి రావడంతో వివాదం సద్దుమణిగింది.