చర్చ: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన జగిశెట్టి సచిన్ (29) అనే యువకుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సచిన్ కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్తో ఇవ్వడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో వైద్యం చేయించామని ఆరు నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.