News & Views

చర్చ, కొత్తగూడెం మున్సిపాలిటీ : అభివృద్ధి హామీలతో విజయ ఢంకా మోగించనున్న కూరపాటి...

అభివృద్ధి హామీలతో విజయ ఢంకా మోగించనున్న కూరపాటి

– ఆర్థిక ఉపాధి కల్పనలు లక్ష్యమే ధ్యేయంగా కార్పొరేషన్ అభివృద్ధి ఉంటుంది – కూరపాటి సుధాకర్ 

చర్చ, కొత్తగూడెం మున్సిపాలిటీ:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపద్యంలో 14వ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ, ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఐ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కూరపాటి సుధాకర్ అభివృద్ధి హామీలతో కార్పొరేటర్ గా విజయఢంకా మోగించనున్నారు. ప్రచారంలో భాగంగా కూరపాటి సుధాకర్ మాట్లాడుతూ, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అభివృద్ధి ఫలాలను, మౌలిక సదుపాయాలను అందించే దిశగా పని చేసాను, ప్రభుత్వాలు ఏవైనా అర్హులైన 19 మందికి ఇండ్ల స్థలాలను, 20 మందికి ఇండ్లు, దళిత బందు వంటి అభివృద్ధి ఫలాలను అందజేసాను. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ను త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గా మార్పు చేయడమే గాక, కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచి నీటి కనెక్షన్ లు, విద్యుత్ స్థంబాలు, వీధి దీపాలు ఏర్పాటు చేసాను. కరోనా కష్టకాలంలో సొంత ఖర్చుతో మనుషులను నియమించి బ్లీచింగ్ వంటి పారిశుద్ధ్యం పనులు, వాక్సిన్ సెంటర్ లు ఏర్పాటు చేసాను. సి ఆర్ పి క్యాంప్ వంటి సింగరేణి ప్రాంతం లో కూడా సిసి రోడ్లు వేయించాను, పెండింగ్ లో ఉన్న రోడ్లను కూడా గెలిచిన వెంటనే వేయిస్తాను. స్థల సేకరణ జరిపి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్పొరేటర్ కార్యాలయం, కమిటీ హాల్, లైబ్రరీ వంటి మొదలగు అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతాను. పేదవారికి మహిళలకు మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాను. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి నంబర్ లు వంటివి మధ్యవర్తి లేకుండానే లంచాలు ఇవ్వకుండానే ప్రభుత్త్వంతో పని చేయించుకునే విధంగా కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తాను. ఏఎన్ఎం లతో ఇంటింటి సర్వే నిర్వహించి కార్పొరేషన్ ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మనిషిని నేను. మీ ఓటును కంకి కొడవలి గుర్తుపై వేసి నన్ను కార్పొరేటర్ గా గెలిపించి కార్పొరేషన్ అభివృద్ధికి సంహరించగలరని ఓటర్లని కోరారు. ప్రచారం లో సుధాకర్ కు మద్దతుగా సిపిఐ శ్రేణులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.