చర్చ : మహిళల ప్రపంచ కప్ విజేత భారత్… జయహో భారత్..

నవి ముంబై మాహిళల ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 298 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోగా లక్ష చేదనలో సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్ల లో 246 పరుగులకే ఆల్ అవుట్ అయింది. షెఫాలీ వర్మ 87 , దీప్తి శర్మ 58 , స్మృతి మందన్న 45 పరుగులు చేసి భారత విజయానికి బాట వేశారు . దీప్తి శర్మ బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా ఐదు వికెట్లు తీసి ఆల్ర్రౌంlడర్ ప్రతిభ కనబరిచింది ఈ విజయంతో దేశం మొత్తం సంబరాలలో మునిగిపోయింది జయహో టీం ఇండియా..