News & Views

చర్చ : ప్రధాని నరేంద్ర మోది దీపావళి సంబరాలు గోవాలోని ఐఎన్ఎస్ విక్రాంత్ నావికాదళంలో నావికాదళ సిబ్బందితో జరుపుకున్నారు…

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి సంబరాలు మన త్రివిధ దళాలలో ఒకటైన నావికాదళ సిబ్బందితో గోవాలోని ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక లో జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోది...

దేశమంతా దీపావళి వేడుకలు అంబరాన్నంటతున్న వేళ. ప్రధాని మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళికి స్వదేశీ నినాదాంతో  ప్రధాని మోదీ ఈసారి దీపావళిని గోవా తీరంలో నేవీ సిబ్బందితో కలిసి జరుపుకోనున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ దీటుగా జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని INS విక్రాంత్‌ యుద్ధనౌకలో మెన్ ఇన్ వైట్‌తో కలిసి ప్రధాని జరుపుకోనున్నారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రతి దీపావళిని సాయుధ దళాల సిబ్బందితో చేసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రతి దీపావళి స్పెషల్‌గా

ప్రధాని మోదీ 2014లో లడఖ్‌లోని సియాచిన్ హిమానీనదంలో భద్రతాదళాలతో కలిసి దీపాల పండుగను జరుపుకున్నారు. ఆ తర్వాత ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరులను సత్కరించడానికి ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని డోగ్రాయ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. 2016లో ప్రధాని హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో వద్ద భారత్-చైనా సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ సిబ్బందితో వేడుకలు జరుపుకున్నారు. మరుసటి ఏడాది ఆయన జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో బలగాలను కలిశారు.