చర్చ అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు తనిఖీలు
గడువు ముగిసిన పదార్థాలు స్వాధీనం - లైసెన్స్ లేని దుకాణాలకు నోటీసులు_

_అన్నపురెడ్డిపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు తనిఖీలు_
గడువు ముగిసిన పదార్థాలు స్వాధీనం – లైసెన్స్ లేని దుకాణాలకు నోటీసులు_
చర్చ అన్నపురెడ్డిపల్లి :
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో కిరాణా, నిత్యావసర సరుకుల దుకాణాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.
*ఎక్స్పైరీ సరుకులు సీజ్:*
ప్రధాన మార్కెట్‌తో పాటు పలు వీధుల్లోని దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న ఆయా పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
*లైసెన్స్ లేని దుకాణాలకు నోటీసులు:*
ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణదారులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలకు అక్కడికక్కడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
*అధికారి హెచ్చరిక:*
“వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడితే సహించం. గడువు ముగిసిన, కల్తీ పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలి. పారిశుధ్యం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం” అని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో స్థానిక ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అధికారుల తనిఖీల సమాచారంతో కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం.