చర్చ కొత్తగూడెం: రోడ్డు ఓవర్ బ్రిడ్జి మరమ్మతులు: ఈనెల 18 నుంచి ట్రాఫిక్ మళ్లింపు_
ఇల్లందు క్రాస్-బొమ్మనపల్లి క్రాస్ మధ్య NH-930Pపై ట్రాఫిక్ ఆంక్షలు - పోలీసుల సూచనలు
చర్చ కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్రాస్ నుంచి బొమ్మనపల్లి క్రాస్ మధ్య లొత్తువాగు గ్రామ సమీపంలో NH-930P జాతీయ రహదారిపై గల రోడ్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల నిమిత్తం ఈనెల 18.06.2026 ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నట్లు కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎల్. ఆదినారాయణ తెలిపారు.
*ప్రధాన మార్గాల మళ్లింపు వివరాలు:*
*1. ఇల్లందు నుంచి పాల్వంచ వెళ్లే వాహనాలు:*
– *భారీ వాహనాలు:* బొమ్మనపల్లి క్రాస్ → హేమచంద్రాపురం → శేషగిరినగర్ → పోస్టాఫీస్ సెంటర్ → మున్సిపల్ ఆఫీస్ → పాత కొత్తగూడెం → జగ్గు తండా → నవ భారత్ → పాల్వంచ.
– *ఆర్టీసీ, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు:* బొమ్మనపల్లి క్రాస్ → హేమచంద్రాపురం → శేషగిరినగర్ → పోస్టాఫీస్ సెంటర్ → బస్టాండ్ → ఓల్డ్ డిపో → ఇల్లందు క్రాస్ → పాల్వంచ.
*2. పాల్వంచ నుంచి ఇల్లందు వెళ్లే వాహనాలు:*
– *భారీ వాహనాలు:* నవ భారత్ → జగ్గు తండా → పాత కొత్తగూడెం → మున్సిపల్ ఆఫీస్ → పోస్టాఫీస్ సెంటర్ → శేషగిరినగర్ → హేమచంద్రాపురం → బొమ్మనపల్లి క్రాస్.
– *ఇతర వాహనాలు:* ఇల్లందు క్రాస్ → ఓల్డ్ డిపో → బస్టాండ్ → పోస్టాఫీస్ సెంటర్ → శేషగిరినగర్ → హేమచంద్రాపురం → బొమ్మనపల్లి క్రాస్.
*3. పాల్వంచ నుంచి ఖమ్మం, విజయవాడ వెళ్లే భారీ వాహనాలు:*
నవ భారత్ → జగ్గు తండా → పాత కొత్తగూడెం → మున్సిపల్ ఆఫీస్ → పోస్టాఫీస్ సెంటర్ → రామవరం మీదుగా ఖమ్మం/విజయవాడ.
*4. విజయవాడ నుంచి పాల్వంచ వచ్చే భారీ వాహనాలు:*
మున్సిపల్ ఆఫీస్ → పాత కొత్తగూడెం → జగ్గు తండా → నవ భారత్ → పాల్వంచ.
వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని ఎస్డీపీఓ ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు.
*ముఖ్య గమనిక:*
_తేదీ:_ 18.06.2026 ఉదయం నుంచి
_ప్రదేశం:_ NH-930P, లొత్తువాగు రోడ్ ఓవర్ బ్రిడ్జి
_కారణం:_ మరమ్మతు పనులు
_సూచన:_ ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలి