చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నూతన సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలం ఇచ్చిన ధాతకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయిల్ ఫాం రైతులు…

నూతన సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలం ఇచ్చిన ధాతకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయిల్ ఫాం రైతులు.
దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు నిర్మాణానికి అవసరమైన ఒక ఎకరం స్థలాన్ని రావు జోగిబాబు వారి తండ్రి రావు సత్యనారాయణ జ్ఞాపకార్ధం ఉచితంగా సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనితో ఈప్రాంత ఆయిల్ పామ్ రైతులకు విద్యుత్ సరఫరా కష్టాలు తొలగి పరిస్థితి మెరుగు కానుంది. సబ్ స్టేషన్ మంజూరు చేసిన విద్యుత్ శాఖ అధికారులకు, స్థల దాత జోగిబాబుకి మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే జారేకు ఈ ప్రాంత రైతుల కష్టం తెలుసుకుని సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అందరికి ఆయిల్ పామ్ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.