చర్చ, సత్తుపల్లి: రూ 5.కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి పై కన్ను

- పెనుబల్లి రెవిన్యూ ఉద్యోగుల నిర్వాహకం
- రూ లక్షలు రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం
- తప్ప ను సరిదిద్దుకునేందుకు తాసిల్దార్ ప్రయత్నం
- తహసిల్దార్ పై సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు…
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ ఉద్యోగులు కంచె చైన్ మేసిన సందాగా పెనుబల్లి తాసిల్దార్ నిర్వాహకం ఉంది. ప్రభుత్వ భూమి ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నంలో భాగంగా 3.20. కుంటల భూమిలో ఎకరం 1.20. కుంటల భూమికి డిజిటల్ సైన్ పూర్తి చేసి పాస్ బుక్ కు ఎదురుచూస్తున్న తరుణంలో భారీ కుంభకోణం వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకెళ్తే పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామం రెవిన్యూ పరిధిలోని లీలావతి మహిళ నుంచి 71/3, 71/4, సర్వే నెంబర్ల లో గల భూమి 3.20. ఎకరాల భూమి ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిక గుర్తించి 2022 ఆగస్టు నెలలో ఆనాటి కలెక్టర్ సరిహద్దులు నిర్ధారించి ప్రభుత్వ భూమిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయగా ఇటీవల చింతగూడెం రెవెన్యూ పరిధిలోని సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే, ఖమ్మం టు దేవరపల్లి, విజయవాడ టు భద్రాచలం, నేషనల్ హైవే ఆనుకొని ఉండటంతో సుమారు ఐదున్నర కోట్ల రూపాయల విలువచేసే భూమిపై కొందరు అక్రమార్కులు కన్నేసి ఇటీవల భూ భారతి లో నమోదు కు అప్లికేషన్ చేయగా ఇటీవల 3.20. ఎకరాల భూమిలో నుంచి 1.20. ఎకరాల భూమి శీలం లీలావతి భర్త రామచందర్ రెడ్డి పేరు మీద తాసిల్దార్ నుంచి డిజిటల్ సైన్ పూర్తిచేసుకుని పట్టాదారు పాస్ పుస్తకం కోసం హైదరాబాద్ సర్వర్ కు పంపబడింది. దీనిపై అనుమానం వచ్చిన చింతగూడెం గ్రామస్తులు రికార్డులను పరిశీలించగా పెనుబల్లి తాసిల్దార్, రెవిన్యూ ఉద్యోగుల నిర్వాహకం బట్టబయలైంది,…..
రూ లక్షల రూపాయలు చేతులు మారినట్లు పెద్ద ఎత్తున ప్రచారం
పెనుబల్లి మండలం చింతగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 71/3, 71/4 గల 3.20. ఎకరాల భూమిని సీలింగ్ భూమిని రిజిస్ట్రేషన్ మార్చి శీలం లీలావతి పేరు నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయటంపై పెనుబల్లి తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్,రెవెన్యూ ఉద్యోగులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు మండలం లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఒప్పందం మేరకు కొంత నగదు రెవెన్యూ ఉద్యోగులకు అందినట్లు పాస్ పుస్తకం అందిన వెంటనే మిగతా నగదు చెల్లించే లాగా ఒప్పందం జరిగినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ గ్రామ రెవెన్యూ అధికారి వి ఏవో విచారణ అనంతరం ఆర్ఐ పంచనామా అక్కడి నుంచి సూపర్డెంట్, తర్వాత డిప్యూటీ తాసిల్దార్, చివరకు తాసిల్దార్ డిజిటల్ సంతకం ఉంటుంది. కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా తాసిల్దార్, డిజిటల్ సైన్ చేసినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు,
తప్ప ను సరిదిద్దేందుకు తాసిల్దార్ ప్రయత్నం
చింతగూడెం సర్వే నెంబర్ 71/3 ,71/4 , 3.20. భూమిలో 1.20. ఎకరాల భూమి ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పొరపాటున డిజిటల్ సైన్ పూర్తి చేసామని తిరిగి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు తాసిల్దార్ మీడియా మిత్రులకు తెలిపారు.
పెనుబల్లి తాసిల్దార్ పై సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
పెనుబల్లి తాసిల్దార్ రెవెన్యూ ఉద్యోగుల నిర్వహకం పై కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ కు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దరిశెట్టి కి పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చింతగూడెం గ్రామస్తులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనను విధుల నుంచి తొలగించాలని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.