News & Views

చర్చ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మామిడితోటలను సందర్శించిన ఉద్యాన అధికారులు

మామిడితోటలను సందర్శించిన ఉద్యాన అధికారులు

జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని మామిడితోటలను జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, ఉద్యాన అధికారి అర్చన, ఉద్యాన విస్తీరణ అధికారులు వంశీకృష్ణ, అన్వేష్ సందర్శించి, మామిడి పూత దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. మామిడి పూతకు ముందు తగిన యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే పూత, కాత సమయంలో చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి మంచి దిగుబడి పొందవచ్చని శ్యామ్ ప్రసాద్ మామిడి రైతులకు సూచించారు. గత సంవత్సరంతో పోల్చితే జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 5 – 10 శాతం మాత్రమే మామిడి తోటలలో పూత కనిపించడం జరుగుతుందని, అక్టోబర్ మాసం వరకు వర్షపాతం నమెదు కావడం దీనికి కారణమని తెలిపారు. నవంబర్ చివిరి వారం నుండి చలి తీవ్రత పెరగడం వంటి వాతావరణ మార్పుల వలన మామిడి పూమొగ్గలు ఏర్పడడంలో జాప్యం ఏర్పడిందని, పూత ఆలస్యంగా రావడం జరుగుతుందని అధికారులు రైతులకు వివరించారు. క్రమం తప్పకుండా కొమ్మ కత్తిరింపులను జూన్ – జులై మాసాలలో చేసుకున్న రైతుల తోటలలో డిసెంబర్ మాసంలో పూత రావడం జరుగుతుందని, ఆగస్టు మాసంలో తోటలు దున్ని ఎరువులు వేసిన తోటల్లో కూడా డిసెంబర్ మాసంలో పూత రావడం జరుగుతుందన్నారు. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పూత రావడంలో జాప్యం జరుగుతుందని, సరైన యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే పూత అదిక శాతంలో రావడమే కాకుండా పురుగులు, తెగుళ్ల బారినుండి కాపాడుకోవచ్చని తెలిపారు.

అధిక పూమొగ్గల కోసం పాటించవలసిన యాజమాన్య పద్ధతులు…
•ఇప్పటి వరకు పూమోగ్గలు అసలు కనిపించని తోటలలో, దుక్కులు దున్నని తోటలలో దున్ని నీరు అందించినచో పూమొగ్గలు ఏర్పడి విచ్చుకోవడం జరుగుతుంది.

•1 లీటరు నీటికి లాండసైహలోత్రిన్ 1 ML మరియు అసిపెట్ 2 గ్రాములు మరియు 12-61 3 గ్రాములు మరియు సిలికాన్ స్పైడర్ 0.5 ML మరియు సాఫ్ 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లలుతే పూత త్వరగా వచ్చి పురుగులు మరియు తెగుళ్ల బారి నుండి తట్టుకోగలుగుతుంది.

చలి తీవ్రత పెరగడం వలన పూతకు బూడిద తెగులు ఆశించి ఫలధీకరణ చెందకుండా చేస్తుంది. పూమొగ్గలు విచ్చుకునే దశలో 1 లీటర్ నీటికి సల్ఫర్ 3 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు కలపి పిచికారి చేయాలి.

గత 3 సంవత్సరాల నుండి జగిత్యాల జిల్లాలో మామిడి తోటలలో పూత, పిందె దశలో తేనె మంచు పురుగు, తామర పురుగులు ఆశించి విపరితమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతులు ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి పురుగు మందులు, సూక్ష్మ పోషక మందులు పిచికారి చేసుకున్నట్లయితే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చని జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
సస్యరక్షణ కోసం సంబందిత ఉద్యాన అదికారులను సంప్రదించి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించడం వలన అనగా పూత కంటే ముందు, పూత దశలో, పిందె దశలో, కాయ దశలో మరియ కోత సమయంలో మందుల పిచికారి, ఎరువులు వేయడం వంటి పద్ధతులు పాటీంచినట్లయితే మామిడి తోటలలో అదిక దిగుబడి సాధించవచ్చు.