News & Views

చర్చ, సత్తుపల్లి: రాబోయే ఎన్నికలలో గులాబీ జెండా ఎగుర వేద్దాం…..

 

నూతన సర్పంచ్ ల అభినందనసభ లో మాజీ ఎమ్మెల్యే సండ్ర…

పెనుబల్లి మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు అధ్యక్షతన నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు వి యం బంజర్ సప్తపది ఫంక్షన్ హాల్ నందు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ అభినందన సభ కి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని పెనుబల్లి మండల పరిధిలో గెలిచిన ప్రతి బిఆర్ఎస్ సర్పంచ్ లకు శాలువాలు తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే కాలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్, ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండా ఎగర వేద్దాం. గెలిచిన సర్పంచ్ విజయగర్వంతో కాకుండా నిరంతరం ప్రజా సేవలో ప్రజల మధ్య ఉండాలని సూచించారు. ఓడిపోయిన వారు ఆదేర్య పడుద్దని రాబోయే కాలంలో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరారు. మనవాళ్ల ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ‌ దైర్యం పడకుండా ధైర్యంతో ముందుకు సాగారు. ఇప్పటికైనా బెదిరింపు రాజకీయాలతో ఏమి సాధించలేరని సూచించారు.. కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు,.ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్, బీ ఆర్ యస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.