News & Views

చర్చ , రామగిరి: ప్రజాభిప్రాయ సేకరణ పనులను పరిశీలించిన: ఆర్జీ-3, జిఎం. సుధాకర్ రావు

ప్రజాభిప్రాయ సేకరణ పనులను పరిశీలించిన: ఆర్జీ-3, జిఎం. సుధాకర్ రావు
చర్చ , రామగిరి:
సింగరేణి రామగుండం-3 ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించి తగిన ఏర్పాట్లను చేయాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అన్నారు.
బుధవారం ఆయన స్థానిక జెఎన్ టియుహెచ్ (మంథని) కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.
వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వారితోపాటు ఎస్వోటు జిఎం యం. రామ్మోహన్, పర్యావరణ అధికారి పి.రాజారెడ్డి, క్వాలిటీ డిజియం బి.వి.సత్య నారాయణ, సివిల్ డిజియం రాజేంద్ర కుమార్, ఏరియా సర్వే అధికారి జనార్ధనరెడ్డి, ఎస్టేట్స్ అధికారి కె.ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బిరుద్దీన్, డివైపిఎం వి.సునీల్ ప్రసాద్, ఫారెస్ట్రీ అధికారి మేఘన, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.