News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కార్మిక హక్కుల రక్షణకై రాజీలేని ఉద్యమాలు నిర్మించాలీ

కార్మిక హక్కుల రక్షణకై రాజీలేని ఉద్యమాలు నిర్మించాలీ

కార్మిక హక్కుల రక్షణకై రాజీలేని ఉద్యమాలు నిర్మించాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ పట్టణంలో సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ రెండవ మహాసభ ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ కార్మిక హక్కులకోసం, వారి జీతాల పెంపుదలకోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని తెలిపారు, పట్టణ మహాసభ ప్రారంభ సూచికంగా సిఐటియు జెండాను సీనియర్ నాయకులు కామ్రేడ్ కృష్ణమూర్తి ఆవిష్కరించారు,ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజ్ రమేష్ మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కుల కోసం సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేయాలని,కార్మిక సంక్షేమాలు గాలికి వదిలేసి, జీతాలు పెంచకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా, కోర్టులు ఎన్ని నిర్ణయాలు చేసినప్పటికీ పాలకవర్గాలు అమలు చేయడం లేదని వారు అన్నారు. అరకోరా జీతాలతో కుటుంబాలు నడవలేక కనీసం రోజుకి రు. 300 కూలీ గిట్టక ఉన్న స్థితి ఉందన్నారు. స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ వర్కర్ల పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .హక్కుల కోసం పోరాటం చేస్తే జీతాలు పెంచమని అడిగితే శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగిస్తుంటే లాఠీలతో సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా కేసులు బనాయించి కోర్టులకు లాగుతున్నారని వారు అన్నారు .అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలో వచ్చాక మరో మాట మాట్లాడుతూ కార్మికులకు మోసం చేస్తున్నారని, వివిధ రంగాలలో, సంస్థలలో పరిశ్రమలలో కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులకు పని గంటలు పెంచి శ్రమను దోచుకుంటూ వేతనాలు అతి తక్కువ ఇస్తున్నారన్నారు. శ్రమ దోపిడీ చేసే వారికి అనుకూలంగా విధానాలు అవలంబిస్తున్నారని అటువంటి విధానాలపై కార్మిక వర్గం చైతన్యంతో ఆలోచనలు చేసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, హాస్టల్ ,డైలీ వేజ్ ,ఔట్సోర్సింగ్, అంగన్వాడి, మధ్యాహ్నం భోజనాలు, బేకరీ ,స్వచ్ఛ, మిత్ర ,ఆటో, బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ,ఆర్టీసీ షాప్ ఎంప్లాయిస్ తదితర ప్రభుత్వ ప్రైవేటుసంస్థలలో పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాంట్రాక్టు కార్మికులతోనే పనిని చేపిస్తూ అధిక లాభాలు గడిస్తున్న తీరుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అన్నారు . ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ సాధించుకున్న కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చి హక్కులను హరించి వేస్తున్నారని వారన్నారు . నాలుగు లేబర్ కోడ్ ల కువ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించకపోతే సమాజ గమనానికి ప్రమాదం వస్తుందని వారు అన్నారు. అటువంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి కార్మిక వర్గ పోరాటాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోట్లను వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించిన చరిత్ర ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని వారు అన్నారు. స్థానికంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని పరిష్కారం కోసం కార్మికుల వెన్నంటే ఉంటూ అందరికీ అండగా ఉంటున్న సిఐటియు సంఘంలో అందరూ సభ్యులుగా చేరి పోరాటాలకు రూపకల్పన చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోపట్టణ కన్వీనర్ దొడ్డ రవికుమార్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పి తులసిరామ్ శ్రామిక మహిళా కే సత్య. భాను రమ్య అచ్చమ్మ విజయ చుక్కమ్మ లక్ష్మి మహేశ్వరి వెంకట నరసమ్మ కుర్మయ్య రాజేష్ కేటీపీఎస్ నాయకులు అంకిరెడ్డి నరసింహారావు శ్రీను తదితరులు పాల్గొన్నారు