News & Views

చర్చ, సత్తుపల్లి : అదుపు తప్పి కారు డివైడర్ ఢీ – ముగ్గురి మృత్యువాత

చర్చ : సత్తుపల్లి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ఉదయం 5 – 6 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి, చండ్రుగొండ నుండి సత్తుపల్లి గృహప్రవేశ కార్యక్రమానికి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలుడు తో సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు… స్థానికుల సమాచారంతో బాధితులను సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించిన 108 బృందం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.