News & Views

చర్చ: సత్తుపల్లి:వరి రైతుకు తీరని నష్టం

మొంథా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పై తీవ్రంగా పడింది

 

 

వరి రైతుకు తీరని నష్టం

చర్చ, సత్తుపల్లి:

మొంథా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పై తీవ్రంగా పడింది.రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జన జీవనం స్తంబించింది.
అకాల వర్షానికి వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
వరి పంటలు కోతలు కోసి ధాన్యం రాశులను కల్లలో అరబోయ్యటంతో వర్షానికి తడిసి ముద్దైంది..మరి కొన్ని చోట్ల వరి నేల వాలి పోయింది.చేతికి వచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో నీట మునగటంతో అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు…మరోపక్క వర్షం తో పాటు చల్లటి ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు..