News & Views

చర్చ కొత్తగూడెం : లేపాక్షి బార్ పక్కన బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి వ్యక్తి కిందపడి గాయాలు

108 సిబ్బంది సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలింపు_ చర్చ కొత్తగూడెం:

చర్చ కొత్తగూడెం:

కొత్తగూడెం లేపాక్షి బార్ పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు.

విషయం తెలుసుకున్న సుజాతనగర్ 108 సిబ్బంది టెక్నీషియన్ పొతురాజు నరేందర్, వంకుడోత్ సాయి కిరణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.

108 సిబ్బంది సకాలంలో స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించడంపై స్థానికులు అభినందించారు.