చర్చ కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం ప్రారంభం_
_కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర విమర్శలు - 12 కీలక డిమాండ్ల

_
*డేట్లైన్:* చర్చ కొత్తగూడెం:
కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీఓఏ క్లబ్లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం తొలిరోజు ఘనంగా ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు హాజరై ప్రసంగించారు. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
నాయకులు తమ ప్రసంగాలలో సింగరేణిలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
గత నెల గోలేటి నుండి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి నాయకుడు, కార్మికుడు, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు.
సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించి కింది డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు:
*కేంద్ర కౌన్సిల్ ప్రధాన డిమాండ్లు:*
1. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
2. కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలి
3. ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి
4. మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
5. సొంత ఇంటి పథకం అమలు చేయాలి
6. పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలి
7. స్ట్రక్చర్ కమిటీలో ఒప్పుకున్న డిమాండ్లు అమలు చేయాలి
8. క్లర్క్ పోస్టుల భర్తీకి కోర్టు కేసుతో సంబంధం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలి
9. పెండింగ్‌లో ఉన్న 350 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలి
10. డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి ప్రత్యేక అవకాశం ఇవ్వాలి
11. సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
12. మైనింగ్ స్టాప్ ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలి
కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నాయకులు హెచ్చరించారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
రేపు సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు యూనియన్ కొమురయ్య గారి కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, సెంట్రల్ సెక్రటరీలు వంగ వెంకట్, వీరస్వామి, అన్ని ఏరియాల బ్రాంచ్ సెక్రెటరీలు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.