చర్చ: సత్తుపల్లి సింగరేణికి ఏడు కోట్లు నష్టం..
వర్షపాతం కారణంగా గనుల్లో నీరు చేరి ఉత్పత్తి నిలిచిపోయింది.


మొంథా తుఫాన్ ప్రభావం – సత్తుపల్లి సింగరేణికి ఏడు కోట్లు నష్టం….
చర్చ, సత్తుపల్లి:
మొంథా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా సత్తుపల్లి పరిధిలోని ఓపెన్‌కాస్ట్ (OC) బొగ్గు గనులపై తీవ్ర ప్రభావం చూపించాయి. వర్షపాతం కారణంగా గనుల్లో నీరు చేరి ఉత్పత్తి నిలిచిపోయింది.
సింగరేణి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓసి1, ఓసీ2 లలో సుమారు 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడింది. సుమారు ఏడు కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అధికారులు తెలియజేశారు. వర్షం ఇదేవిధంగా కొనసాగితే నష్టం శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు.