చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,ప్రచారాలకు అనుమతి తప్పనిసరి. -మున్సిపల్ కమీషనర్ నాగరాజు…

ప్రచారాలకు అనుమతి తప్పనిసరి. -మున్సిపల్ కమీషనర్ నాగరాజు.
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల అద్యక్షులు, కుల సంఘాల అధ్యక్షులు మీ యొక్క పార్టీలకు చెందిన కార్యకలాపాల నిమిత్తం చేపట్టే ప్రచారాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ నాగరాజు పేర్కొన్నారు. పార్టీ, కుల సంఘాల కు చెందిన కార్యకలాపాల నిమిత్తం పురపాలక సంఘం అశ్వారావుపేట పరిధిలో ఎటువంటి అనుమతి లేకుండా పార్టీ/కుల పోస్టర్లు అంటించడం గాని పార్టీ/కుల జెండాలు కట్టడం గాని పార్టీ/కులాల కి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గాని పురపాలక సంఘం అశ్వారావుపేట కమిషనర్ అనుమతి లేకుండా పైన ఉదాహ రించిన వాటిని అంటిచడం గాని పెట్టడం గాని ఏర్పాటు వేయటం గాని చేయరాదని హెచ్చరించారు. అనుమతి లేకుండా పార్టీ కార్యకలాపాలకు చెందిన పోస్టర్స్ అంటించడం గాని ఉంచడం గాని,కట్టడం గాని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గాని చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.