చర్చ : యాదగిరిగుట్ట , ఏసీబీ కి చిక్కిన ఇన్చార్జి ఎస్ ఈ ఊడెపు రామారావు…యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్…

ఏసీబీ కి చిక్కిన ఇన్చార్జి ఎస్ ఈ ఊడెపు రామారావు.
వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ ఈ గా బాధ్యతలు స్వీకరించిన రామారావు., యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్.మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ అడిగిన రామారావు.ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు కుదిరిన ఒప్పందం. కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్ళని కలవడంతో నిఘా పెట్టినా నల్గొండ ఏసీబీ అధికారులు.రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రామారావు కు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం.రామారావుకు హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా రెండు టీములు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం ఈరోజు మధ్యాహ్నం వరకి తెలుస్తుందని చెప్పిన ఏసీబీ డీఎస్పీ తెలిపారు.రామారావును జ్యూడిషల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపిన ఏసీబీ అధికారి. ఉమ్మడి నలగొండ జిల్లా ప్రజలకు ఇలాంటి ఉంటే సమాచారం మాకు ఇవ్వాలని ఏసీబీ అధికారుల విజ్ఞప్తి.