చర్చ : అక్టోబర్ , తప్పిన ప్రమాదం… అశోక్ నగర్ సాయిబాబా గుడి వద్ద 420 నిండు వంటగ్యాస్ సిలిండర్స్ తో లారీ బోల్తా…

తప్పిన ప్రమాదం…
అశోక్ నగర్ సాయిబాబా గుడి వద్ద 420 నిండు వంటగ్యాస్ సిలిండర్స్ తో లారీ బోల్తా…
పిన్నపాక నియోజకవర్గం ప్రజలకు ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు…
రోడ్లు మొత్తం గుంటలమయం..
చినుకు పడితే రహదారిలో గుంటలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాక వాహనదారులు ఇబ్బంది పడుతున్నరు…
ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ లోడుతో వస్తున్న లారీ ప్రమాదవశాత్తు ఈరోజు వర్షం నీటితో నిండి ఉన్న గుంటలు సరిగ్గా కనిపించక ఒక్కసారిగా గుంటలో పడిన లారీ అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న డివైడర్ పైకి ఎక్కటంతో 420 నిండు గ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి బోల్తా పడిందది. పొరపాటున జరిగిన కూడా ఒక్క సిలిండర్ కూడా బ్లాస్ట్ అవ్వకపోవడం వలన చుట్టుపక్కన ప్రజలు వ్యాపారస్తులు పెద్ద ప్రమాదం తప్పి అని ఊపిరి పీల్చుకున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే గారు అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని మణుగూరు ప్రజలు కోరుకుంటున్నారు.