News & Views

చర్చ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ

జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పాల్వంచ పోలీస్ వారి ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ”

 

చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ:
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం జాతీయ ఐక్యత దినోత్సవం (అక్టోబర్ 31) సందర్భంగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి 150వ జయంతి పురస్కరించుకొని, జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పాల్వంచ పోలీస్ వారి ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో భాగంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2k రన్ నిర్వహించడం జరిగింది. యువత దాదాపు 500 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్, ఎస్ఐ సుమన్, జీవన్ రాజ్ మరియు కళ్యాణి, ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ తోపాటు పోలీస్ సిబ్బంది పలువురు ప్రముఖులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…