చర్చ:కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలోమున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి మంచినీటి సరఫరా ప్రతిరోజు అందించాలనీ, కోతులు, కుక్కల బెడద నుండి ప్రజలను రక్షించాలనీ, వర్షాల కారణంగా దెబ్బతిన్న అంతర్గత సిసి రోడ్లను తక్షణమే మరమ్మతు చేయాలని, బస్తీల్లో దోమల మందు, బ్లీచింగ్ పొడి చల్లే కార్యక్రమాన్ని పునరుద్ధరించాలనీ డిమాండ్ చేశారు.
ధర్నాలో సీపీఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాల్ రాజ్, సిఐటియు నాయకులు భూక్యా రమేష్, మహిళా నాయకురాలు ,కార్యకర్తలు పాల్గొన్నారు