News & Views

చర్చ:- అశ్వారావుపేట: జొన్నారం వాగులో వ్యాను కొట్టుకుపోయిన ఘటనలొ ఎట్టకేలకు క్రెయిన్ సహాయంతో వ్యానును బయటకు తీసిన గ్రామస్థులు.

డ్రైవర్ మురళి ఆచూకీ దొరుకుందా లేదా అనేది అర్ధం కాని పరిస్థితి

 

 

 

జొన్నారం వాగులో వ్యాను కొట్టుకుపోయిన ఘటనలొ ఎట్టకేలకు క్రెయిన్ సహాయంతో వ్యానును బయటకు తీసిన గ్రామస్థులు.

చర్చ:- అశ్వారావుపేట.

అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన మునుగొండ వెంకట ముత్యం అనే వ్యక్తికి చెందిన వ్యాను జొన్నారం వాగులో కొట్టుకుపోయిన సంగతి అందరికి తెలిసిందే అయితే నిన్నటివరకు వ్యానును NDRF సిబ్బంది బయటకు తీసుకురాలేక వెనుదిరిగి వెళ్లిపోవడంతో స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామస్థుల సహాయంతో క్రెయిన్ ఏర్పాటు చేసి బయటకు లాగటం జరిగింది. వ్యాను అద్దాలు అన్ని పగిలిపోయి ఉన్నాయి. అందులో డ్రైవర్ మురళి ఆచూకీ తెలియకపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. డ్రైవర్ మురళి ఆచూకీ కోసం గ్రామస్థులు పోలీస్ సిబ్బంది కలిసి కాలువలో చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం పరీక్షించినప్పటికి ఆచూకీ దొరకకపోవడంతో తెప్పలు వేసుకుని దగ్గర ఉన్న చెర్వు వద్దకు వెళ్లి వెతకాలని సూచించడంతో ప్రయత్నాలు మొదలు పెట్టారు కాని డ్రైవర్ మురళి ఆచూకీ దొరుకుందా లేదా అనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆచూకీ దొరికేవరకు వెతుకుతామని అధికారులు తెలిపారు.