News & Views

చర్చ : పాల్వంచ: ఎస్‌.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

 

ఎస్‌.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ:  జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్‌ (ఎస్‌.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్టరింగ్ ఆఫీసర్లు (AEROs), బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) మరియు బిఎల్ఓ సూపర్వైజర్లతో ఎస్‌.ఐ.ఆర్ పూర్వ సన్నాహక ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను పారదర్శకంగా, తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలని, నిర్దిష్ట రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బిఎల్ఓలు బాధ్యతాయుతంగా పని చేసి, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో తప్పకుండా ఉండేలా నిశిత పరిశీలన జరపాలని సూచించారు.

2002 సంవత్సరపు ఓటరు జాబితాను 2025 సంవత్సరం జాబితాతో మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు గుర్తు చేశారు. ముందుగా మ్యాపింగ్ చేయబడిన కేటగిరి ‘ఏ’ జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా ధృవీకరించి, అది ఎన్నికల సంఘం పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కేటగిరీ ‘సి’ మరియు కేటగిరీ ‘డి’ లోని ఓటర్లను ‘ఏ’ కేటగిరీకి మ్యాపింగ్ చేసే ప్రక్రియను ఎఇఆర్ఓల ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలు బిఎల్ఓ యాప్ ద్వారా పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, ప్రజా పాలన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన సాదా బైనామా మరియు అసైన్డ్ భూముల పెండింగ్ దరఖాస్తులను నవంబర్ 3వ తేదీ లోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు పరిష్కరించిన దరఖాస్తులపై వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలనీ, తిరస్కరించిన దరఖాస్తులపై తగిన కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించా