చర్చ: పాల్వంచ:పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకము
శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకములు

పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకము
చర్చ: పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మండలం పరిధిలో కేపీ జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) నందు అమ్మవారికి పంచామృతములతో వైభవముగా అభిషేకము నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో దేవస్థాన అర్చకులు, భక్తులు జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించి అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూలవిరాటు పంచామృతాలతో అభిషేకం అనంతరం పంచ హారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పూజలలో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించినారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా కార్తీకమాసోత్సవం
శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకములు
కార్తీకమాసం సందర్భంగా నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతములతో అభిషేకములు, లక్ష బిల్వర్చన అనంతరం హారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశదీపం నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పూజలలో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించినారు. ఇట్టి కార్యక్రమములలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్.రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ శ్రీ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు శ్రీ పెండ్లి రామిరెడ్డి, శ్రీ చెవుగాని పాపారావు, శ్రీ చెరుకూరి శేఖర్ బాబు, శ్రీ అడుసుమిల్లి సాయిబాబా, సిబ్బంది,మరియు భక్తులు పాల్గొన్నారు.
రేపు అనగా తేది : 01.11.2025, శనివారము “ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతములు ఉదయం 10-00 గంటలకు” నిర్వహించబడును.