చర్చ:సత్తుపల్లి: పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చటం కాంగ్రెస్ పార్టీతోనేసాధ్యం ఎమ్మెల్యే మట్ట రాగమయి….
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం

పేదవాడి సొంత ఇంటి కలనెరవేర్చటంకాంగ్రెస్ పార్టీతోనేసాధ్యం ఎమ్మెల్యే మట్ట రాగమయి….
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల రాజీవ్ నగర్ కాలనీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్ట రాగమయి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా గృహప్రవేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మణికంఠ –శాంతి దంపతుల కొత్త ఇంటిని ప్రారంభించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ప్రజలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని నియోజకవర్గంలోని సొంతిళ్ళు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఏర్పాటు చెయ్యడమే నా లక్ష్యం అని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించడానికి నావంతు కృషి నేనుచేస్తా అని తెలిపారు . ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.