News & Views

చర్చ : కరీంనగర్ , వెలిచాల ప్యానెల్ కు మద్దతుగా ప్రభం”జనం”…

చర్చ :- కరీంనగర్

వెలిచాల ప్యానెల్ కు మద్దతుగా ప్రభం”జనం”.

వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అర్బన్ మెంబెర్స్..

ఎక్కడా చూసినా వెలిచాల ప్యానల్ ఘన విజయమనే చర్చ..

పెద్ద ఎత్తున మద్దతు
పలుకుతున్న ప్రజలు..

అర్బన్ బ్యాంకు ఎన్నికల సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బలపరిచిన ప్యానల్ కు మద్దతు వేలాదిమంది ప్రభంజనం గా తరలివచ్చారు. కరీంనగర్ తో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు అర్బన్ ఓటర్లు ఈ ప్యానెల్ కు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడా చూసినా వెలిచాల ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇదే అంశం కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అర్బన్ బ్యాంక్ ఓటర్లంతా వెలిచాల ప్యానల్ వైపే మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. మార్పు కోసం వివాదాల నుంచి విశ్వాసం వైపు నడిపించేందుకు అర్బన్ బ్యాంక్ ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు వెలిచాల రాజేందర్ రావ్ బలపరిచిన ప్యానల్ అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో వెలిచాల రాజేందర్ రావు తోపాటు ముఖ్య నేతలు తమ అభ్యర్థుల చేయాలని అభ్యర్థించారు. దీంతో ప్రజలు అర్బన్ బ్యాంక్ ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కచ్చితంగా ప్యానల్ అభ్యర్థులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు దశ దిశ మహర్దశ పట్టేందుకు వెలిచాల ప్యానల్ ని బలపరుస్తున్నామని పలు ఓటర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తానికి అర్బన్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో చరిత్ర సృష్టించే దిశగా వెలిచాల ప్యానల్ ముందుకు కదులుతుంది. అర్బన్ బ్యాంకు చరిత్రలోనే చారిత్రాత్మక తీర్పును అర్బన్ బ్యాంకు మెంబర్లు ఇవ్వబోతున్నారు. వేలాదిమంది ప్రజలు, అర్బన్ బ్యాంకు ఓటర్ల మద్దతు తమ పానెల్ కచ్చితంగా విజయం సాధిస్తామని వెలిచాల రాజేందర్రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం పోలింగ్ సందర్భంగా వేలాది మంది తరలి రావడమేనని పేర్కొన్నారు. తమకు మద్దతుగా పెద్ద ఎత్తున జన సందోహం తను రావడంతో తమ ప్యానెల్ లో మరింత రెట్టింపు ఉత్సాహం ఉరకలేస్తుందన్నారు.