చర్చ : గోదావరిఖని :అంజన్న హుండీ కి కన్నం వేసిన దొంగలు.
గోదావరిఖని జీఎం కాలనీలోని సంజీవఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి
చర్చ ,గోదావరిఖని (నవంబర్ 01). అంజన్న హుండీ కి కన్నం వేసిన దొంగలు.
గోదావరిఖని జీఎం కాలనీలోని సంజీవఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.శనివారం తెలవారుజామున ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ గుడికి వచ్చేసరికి హుండీ తాళం పగులగొట్టి ఉండటంతో వెంటనే ఆలయ కమిటీ తెలుపడంతో పోలీసులకు సమాచారం అందిచారు.గత మూడు నెలలుగా హుండీని తెరువలేదని, అందులో దాదాపు 15 వేల రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ పేర్కొన్నారు. చోరి ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.