చర్చ : అమెరికా , ఎంత ఘోరం,అన్యాయం….చేయని తప్పుకు అమెరికాలో 43 ఏండ్లు జైలు శిక్ష…

ఎంత ఘోరం,అన్యాయం….చేయని తప్పుకు అమెరికాలో 43 ఏండ్లు జైలు శిక్ష అనుభవించిన… సుబ్రమణ్య వేదం (ఇప్పుడు ఇతని వయసు 65)….!!!
సుబ్బు వేదం అని పిలవబడే ఇతను 9 నెలల వయసు ఉన్నప్పుడు తల్లితండ్రులతో అమెరికాకు పోయి…అక్కడే చదువుకుంటున్నాడు…
ఇతనికి 22 ఏండ్లు ఉన్నప్పుడు ఇతని క్లాస్ మేట్ థామస్ అనే అతన్ని ఇతను మర్డర్ చేసిండు అనే ఆరోపణలతో జైల్లో వేసిండ్రు….
కానీ ఇతనే ఆ మర్డర్ చేసిండు అని నిరూపణ కాలేదు అయినా 43 ఏండ్లు జైల్లో పెట్టిండ్రు…
ఇతను జైల్లో ఎంతో మంచిగా ఉంటూ అక్కడే ఎన్నో కోర్సులు కంప్లీట్ చేసిండు…తోటి ఖైదీలను సుక చదివించిండు….
చివరికి మొన్న అక్టోబర్ 3 నాడు నిర్దోషిగా ప్రూఫ్ అయి అప్పుడు విడుదల చేసిండ్రు…
విడుదల అయిన తెల్లారి మళ్ళా పోలీస్ లు అరెస్ట్ చేసి ఇప్పుడు ఇతన్ని ఇండియా కు పంపించాలని చూస్తున్నారు…
కానీ…ఇతని తల్లి తండ్రులు ఆల్రెడీ చనిపోయిండ్రు…ఇండియా తో ఇతనికి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు….
ఇక్కడికి పంపిస్తే అతనికి ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఆధారం లేదు….!!!