News & Views

చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా, స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ చేసిన విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా…

స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ చేసిన విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా…

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ చేసిన విజయవాడ మాజీ శాసనసభ్యులు రంగా తనయుడు వంగవీటి రాధా, ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలు శాసన సభ్యులుగా పనిచేసిన వంగవీటి మోహనరంగా ప్రజల గుండెల్లో మూడున్నర దశాబ్దాలు గుర్తుండి ఇంత అభిమానాన్ని కూడగట్టుకున్న మోహనరంగా కి ధన్యవాదాలు తెలియజేస్తూ పూలమాల లేసి ఘన నివారణ అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయి మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవకే పని చేస్తూ ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతూ తనదైన ముద్ర వేసుకున్న వంగవీటి మోహనరంగా కు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు అభిమానులు, రంగా అభిమానులు పాల్గొన్నారు.