News & Views

చర్చ : గోదావరిఖని, సింగరేణి యువ కార్మికులారా కార్మిక సంఘాల్లో చేరండి…

సింగరేణి యువ కార్మికులారా కార్మిక సంఘాల్లో చేరండి.

సింగరేణి యువ కార్మికులకు పిలుపునిచ్చిన సిఐటియు ఆల్ ఇండియా సెక్రెటరీ సుదీప్ దత్త .

గోదావరిఖని RCOA క్లబ్ లో ఆదివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యువ కార్మికుల పరస్పర అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సుదీప్ దత్త హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కార్మిక సంఘాలలో యువ కార్మికుల భాగస్వామ్యం పెరిగితేనే కార్మికుల హక్కులు కాపాడుకోగలుగుతామని అన్నారు. భవిష్యత్తు అంతా యువ కార్మికులదేనని అన్నారు. ప్రస్తుతం యువ కార్మికులు కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని అప్పుడే రాజకీయంగా ప్రభుత్వాలు తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి మరింత అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు ఉన్న నాయకులందరూ గతంలో అనేక సమస్యలను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారేనని ప్రస్తుతం యువత తాము పనిచేస్తున్న ప్రదేశాలలో సమస్యలపై దృష్టి పెట్టక పోవడం వల్లనే పని ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చుతూ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కుట్ర చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే కార్మికులు ఈ కుట్రలు తిప్పి కొట్టేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. పని ప్రదేశాల్లోని సమస్యలపై పోరాటాలు చేస్తూ హక్కులను కాపాడుకోవాలని అన్నారు. సిఐటియు యువ కార్మికులను నాయకులగా తీర్చిదిద్దేందుకు బ్రాంచి, రాష్ట్ర స్థాయిలో క్లాసులను నిర్వహిస్తున్నామని తెలుపారు. యువ కార్మికులందరూ వీటిని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంగా కార్మిక సంఘాల పోరాటాల్లో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహ రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజు గోపాల్, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఎస్కే గౌస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, దాసరి సురేష్, వంగల శివరాం రెడ్డి, ఏ శంకరన్న, ఆర్జి 2 అధ్యక్ష కార్యదర్శులు, వినయ్, కుంట ప్రవీణ్ కుమార్, ఎస్ వెంకన్న, మామిడాల శ్రీహరి, అర్జీ 3 అధ్యక్ష కార్యదర్శులు, శ్రీనివాస్, డి కొమరయ్య, ఈ కుమార్, మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి, అల్లి రాజేందర్, శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతోపాటు వివిధ బ్రాంచిల యువ కార్మికులు పాల్గొన్నారు,